Most Recent

Raghava Lawrence: పేద పిల్లల పాలిట దేవుడిలా రాఘవ లారెన్స్‌.. 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న రియల్‌ హీరో

Raghava Lawrence: పేద పిల్లల పాలిట దేవుడిలా రాఘవ లారెన్స్‌.. 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న రియల్‌ హీరో
Raghava Lawrence

రాఘవ లారెన్స్‌.. పరిచయం అవసరం లేని పేరు. సినిమా ఇండస్ట్రీలో స్వ శక్తితో ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. మొదట్లో డ్యాన్స్‌ మాస్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆతర్వాత నటుడి గానూ తన ట్యాలెంట్‌నూ నిరూపించుకున్నాడు. మెగా ఫోన్‌ పట్టి డైరెక్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌లో మరొక మంచి గుణం ఉంది. అదే సేవా గుణం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన వేలాది మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో చదివిస్తున్నారు. అలాగే లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు లారెన్స్‌. మరో 150 మంది పిల్లలను దత్తత తీసుకున్న ఆయన వారందరికీ నాణ్యమైన విద్యను అందిస్తానంటూ వాగ్ధానం చేశారు. ఇందుకు సినీ ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులు కావాలని కోరాడు. తన లేటెస్ట్‌ సినిమా రుద్రన్ (తెలుగులో రుద్రుడు) సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు లారెన్స్‌.

పిల్లలకు శస్త్రచికిత్స, హార్ట్‌ సర్జరీలు..

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు . కాగా లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఒక్కసారి 141 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేయించి వార్తల్లో నిలిచారు. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులెవరికైనా గుండెకు శస్త్రచికిత్స చేయించాలన్న, ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమవుతున్నారని తెలిసినా వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించాలని లారెన్స్ కోరారు.

చంద్రముఖి 2తో..

ఇక సినిమాల విషయానికొస్తే.. లారెన్స్ నటించిన రుద్రడు ఈనెల 14న రిలీజ్‌ కానుంది. కతిరేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రాధికా శరత్‌ కుమార్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. దీంతో పాటు రజనీకాంత్‌ చంద్రముఖి సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తున్నారు లారెన్స్‌. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కీలక పాత్ర పోషించింది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకురానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.