Most Recent

Pawan Kalyan: స్టైలీష్ అండ్ కూల్‏గా పవర్ స్టార్.. ‘ఓజీ’ సెట్‏లో కళ్యాణ్ బాబు లుక్ అదిరింది..

Pawan Kalyan: స్టైలీష్ అండ్ కూల్‏గా పవర్ స్టార్.. ‘ఓజీ’ సెట్‏లో కళ్యాణ్ బాబు లుక్ అదిరింది..
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా తన సినిమాలన్ని కంప్లీ్ట్ చేసి.. ఎన్నికల నాటికి రాజకీయాల్లో పాల్గొనేందుకు ట్రై చేస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టారు. హరిహర వీరమల్లు షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇందులో సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). సుజిత్, పవన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. పవర్ స్టార్ సెట్‏లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అందులో బ్లాక్ హూడీ ధరించి కళ్లాద్దాలతో పవన్ చాలా స్టైల్ గా కనిపించారు. ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా సెట్ నుంచి ఆయనకు సంబంధించిన మరో ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటో ఓజీ సెట్‏లో షూటింగ్ జరుగుతున్న సమయంలోది కావడమే విశేషం. అందులో గాగుల్స్ పెట్టుకుని బ్లూ కలర్ లెనిన్ షర్ట్ ధరించి బ్లూకలర్ షర్ట్ వేసుకొని ఉన్నారు. క్యారవ్యాన్ కి ఆనుకొని….ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండగా.. ఫోటో క్లిక్ మనిపించారు. ఫోటో క్యాన్ డిడ్ అయినా.. లుక్ మాత్రం అదిరిందంటూ కామెంట్స్ చేస్తూ.. తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ హీరోయిన్ సైతం సెట్ లో జాయిన్ అయ్యిందంటూ చిత్రయూనిట్ ప్రకటించింది.

భారీ స్తాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇటీవల ఓజీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేస్తూ.. అభిమానులను ఖుషి చేశారు మేకర్స్.

Og

Og

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.