Most Recent

Balagam Movie: చిన్నప్పుడే నాన్న మరణం.. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లి.. బలగం నటుడి జీవితంలో కష్టాలు..

Balagam Movie: చిన్నప్పుడే నాన్న మరణం.. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన తల్లి.. బలగం నటుడి జీవితంలో కష్టాలు..
Balagam

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ప్రేక్షకుల మనసులను తాకిన చిత్రం బలగం. అప్పటివరకు తన కామెడితో అలరించిన జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. మార్చి 3న రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు రూ. 26 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఈ సినిమాలో స్టార్ డమ్ ఉన్న నటీనటులు నటించలేదు. ఈ మూవీలో కనిపించిన నటీనటులందరూ అప్పటివరకు ప్రేక్షకులకు అంతగా తెలియనివారే. అయినా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలలో సహజ నటనతో జనాలను కంటతడి పెట్టించారు. అందులో కమెడియన్ కర్తానందం ఒకరు.

జబర్దస్త్ స్టేజ్ పై సందడి చేయిన ఆయన చాలా మందికి తెలియదు. కానీ చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో … తెలంగాణ యాసతో నవ్వించడమే ఆయన ప్రత్యేకత. ఇటీవల సూపర్ హిట్స్ గా నిలిచిన బలగం, దసరా సినిమాల్లో నటించారు. ఈ సినిమాతో ఆయనకు గుర్తింపు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కర్తానందం… తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడే నాన్న మరణం.. అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని తమను పెంచడం గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

“నేను పుట్టి పెరిగింది.. ఉద్యోగం చేసింది తెలంగాణలోనే. అందుకే ఈ భాషపై పట్టు ఉంది. మేము నలుగురం అన్నదమ్ములం. ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. మమ్మల్ని పెంచడానికి అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుంది. ఆమె పడిన కష్టాలను తలుచుకుంటే ఏడుపొస్తుంది. అమ్మ గుర్తొస్తే కన్నీళ్లు రానిదేవరికి ? ” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మా అమ్మ మమ్మల్ని చదివించింది. నేనూ నా పిల్లల విషయంలో అదే పనిచేశాను. జబర్దస్త్ లో తాగుబోతు రాజమౌళి ద్వారా నాకు వేణు పరిచయమయ్యాడు. వేణు టీంలో 200 ఎపిసోడ్స్ లో నటించాను. కామెడీ షో నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. నన్ను బుల్లితెరకు పరిచయం చేసింది వేణు. ఇప్పుడు బలగం సినిమాతో గుర్తింపు తెచ్చింది వేణు. ఆయన రుణం నేను తీర్చుకోలేను అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.