Most Recent

Balagam Movie: ఇంటర్నేషనల్ వేదికపై సత్తా చాటుతోన్న ‘బలగం’.. చిన్న సినిమాకు మరో మూడు అవార్డ్స్..

Balagam Movie: ఇంటర్నేషనల్ వేదికపై సత్తా చాటుతోన్న ‘బలగం’.. చిన్న సినిమాకు మరో మూడు అవార్డ్స్..
Balagam

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బలగం. జబర్దస్త్ ఫేం వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పట్టణాల్లోనే కాకుండా.. పల్లెటూర్లలలోనూ ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఊళ్లలో స్క్రీన్లు వేసి మరీ ఈ సినిమాను చూస్తున్నారు. అటు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలో జనాల తాకిడి మాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. తాజాగా మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈ సినిమాకు దక్కాయి.

ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్‏బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బలగం మూవీ ఏకంగా మూడు అవార్డ్స్ గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో బలగం మూవీకి అవార్డ్స్ దక్కాయి. అంతర్జాతీయ వేదికపై బలగం ఇలా వరుసగా అవార్డ్స్ దక్కించుకుంటుండటంతో ఈ సినిమా మున్ముందు మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

చిన్న సినిమాగా వచ్చిన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 40కి పైగా అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకున్నట్లు ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.