

హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. చిన్నప్పటి ఫోటోల నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పై ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా.. అందంలో ఈ అమ్మడు అప్సరస.. ఏమాత్రం మొహమాట పడకుండా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్విస్తోంది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ లోని మెరిసి అలరించింది ఈ బ్యూటీ. ఇంతకు అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో ఉన్న వాలు కళ్ళ సుందరి మరెవరో కాదు అమ్మడు తెలుగుగమ్మాయి డింపుల్ హయతి.డింపుల్ 2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఈ అమ్మడు పుటింది హైదరాబాద్ లోనే.. ఇక ఈ అమ్మడు గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.
అలాగే ఆత్రంగి రే అనే హిందీ సినిమాలోనూ కనిపించింది. ఇక రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి మూవీలో నటించింది. ఇక ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తోన్న రామబాణం సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే డింపుల్ కు అవకాశాలు క్యూ కడతాయి. ప్రస్తుతం ఈ భామ రామబాణం సినిమా పైనే ఆశలు పెట్టుకుంది.