Most Recent

7G Brindavan Colony: 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ పై ఆసక్తికర అప్డేట్.. ఈసారి హీరో ఎవరంటే..

7G Brindavan Colony: 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ పై ఆసక్తికర అప్డేట్.. ఈసారి హీరో ఎవరంటే..
7g Brindavan Colony

వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొన్ని నెలల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో వైరలవుతుంది.

ఈ సినిమా సీక్వెల్‏కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రొమాంటిక్ డ్రామా సీక్వెల్ షూటింగ్ ను జూలైలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి పార్ట్ లో నటించిన రవికృష్ణ సీక్వెల్లో కూడా నటించనున్నట్లుగా నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు. ఇక ఫస్ట్ పార్ట్ లాగే.. ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నారట డైరెక్టర్ సెల్వ రాఘవన్.

ఇక సెకండ్ పార్ట్ లో హీరోయిన్ మారనుంది. గతంలో సోనియా అగర్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.