Most Recent

Viral Photo: చీరకట్టులో సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. కుర్రాళ్ల కలల రాకుమారి ఈ అమ్మడు..

Actress

పైన ఫోటోలో చీరకట్టులో సిగ్గులొలుకుతున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకుంది ఈ ముద్దుగుమ్మ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం..మలయాళంలోనూ ఎన్నో ఆఫర్లు అందుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఈ అమ్మడుకు యూత్‏తో యమ ఫాలోయింగ్ ఉంటుంది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఆ చిన్నారి మరెవరో కాదండోయ్.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. సహజమైన నటనతో… నెమలి లాంటి నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. మేకప్ లేకుండానే తెరపై కనిపిస్తూ న్యాచురల్ బ్యూటీ అని పేరుతెచ్చుకుంది ఈ చిన్నది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయబద్దంగా అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా.. వెండితెరపై ఆడియన్స్ చూపు తిప్పుకొనివ్వకుండా చేయడంలో ఈ న్యాచురల్ బ్యూటీ దిట్ట. హీరోలతో సరిసమానంగా అంతకు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి.. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, పడి పడి లేచే మనసు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక రానా సరసన నటించిన విరాట పర్వం సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు (మే 9) సాయి పల్లవి పుట్టిన రోజు.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.