Most Recent

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్..మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. అలాగే కళావతి, పెన్నీ, మా.. మా.. మహేషా సాంగ్స్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సర్కారు వారి పాట చిత్రం విడుదల కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్.. కీర్తి సురేష్ మరింత గ్లామరస్.. స్టన్నింగ్ లుక్స్‏లలో కనిపించబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇటీవలే యూసఫ్ గూడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కాగా.. ఈ సినిమా నిడివి.. దాదాపు 162 నిమిషాల 25 సెకన్లు ఉంటుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Sarkaru Vaari Paata: ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. దర్శకుడు పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో అడుగు పెట్టేది అప్పుడే.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.