Most Recent

Pakka Commercial: శరవేగంగా మారుతి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. పక్కా కమర్షియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Pakka Commercial

తనదైన మార్క్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు దర్శకుడు మారుతి(Maruti). ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్(Pakka Commercial). మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న విషయం తెలిసిందే. పక్కా కమర్షియల్ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జిక్రు రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని టెల్;తెలుస్తుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.  మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.