Most Recent

NBK 107: బాలయ్య- గోపీచంద్ సినిమా టైటిల్ ఇదేనా.. నెట్టింట వైరల్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంచలన విజయం అందుకున్న అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని( Gopichanda Malineni)దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 107 సినిమా గా ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. క్రాక్ సినిమాతో మంచి అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య కోడం ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. బాల‌య్య‌107వ సినిమాగా ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్   సిరిసిల్ల టౌన్‌ (తెలంగాణ) పరిసరప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో పేరు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్, టైటిల్ ను ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. మరిన్ని ఇక్కడ చదవండి :  Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు.. F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే Upasana konidela : 150 వృద్ధాశ్రమాలకు చేయూతనందిస్తున్న రామ్ చరణ్ సతీమణి..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.