Most Recent

Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) కాంబోలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు విశేష స్పందన లభిస్తోంది. అలాగే.. కళావతి, పెన్నీ సాంగ్స్ యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కళావతి క్యారెక్టర్లో తనను ఊహిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూనే.. షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను తెలియజేసింది.

ఈవెంట్లో మాట్లాడడానికి స్టేజీ ఎక్కీ ఎక్కగానే యాంకర్ సుమ పై సైలెంట్ పంచ్‌లు వేసిన కీర్తి… ఆ తరువాత స్ట్రెయిట్ అవే డైరెక్టర్ ను ఎయిమ్‌ చేసింది. షూటింగ్లో తనను రష్మిక పేరుతో పిలుస్తున్నారని అసలు విషయం చెప్పింది. అంతేకాదు నెక్ట్స్ సినిమా రష్మికతో చేస్తున్నారా ఏంటని వేదిక పైనే అనేసింది. ఒక వేళ రష్మికతో నెక్స్ట్‌ ఫిల్మ్ చేస్తున్నట్టైతే.. ఆమెను సెట్లో కీర్తి అని పిలుస్తారా ఏంటని మరో పంచ్ వేసింది. కీర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనున్నాడు.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్

KGF Chapter2: ఖండాంతరాలు దాటుతోన్న కేజీఎఫ్‌ ఖ్యాతి.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డు..

Thalapathy 66 : దళపతి సినిమాలో సహజ నటి.. విజయ్ 66లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.