Most Recent

Keerthy Suresh: చెల్లి పాత్రలు చేయడానికి అసలు కారణం అదే.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్..

Keerthy Suresh

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్ (Keerthy Suresh).. సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులను దొచుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. తాజాగా సూపర్ స్టా్ర్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాత్రలో నటించింది కీర్తి. ఈరోజు విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఓవైపు స్టార్ హీరోయిన్‏గా వరుస ఆఫర్లు అందుకుంటున్న కీర్తి సురేష్.. మరోవైపు చెల్లెలు పాత్రలను కూడా చేసేస్తుంది. ఇటీవల రజినీ కాంత్ నటించిన పెద్దన్న సినిమాలో సూపర్ స్టార్ చెల్లెలిగా నటించి మెప్పించింది కీర్తి .. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలోనూ చిరు చెల్లిగా నటిస్తోంది. అయితే వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి ఇలా చెల్లెలి పాత్రలు చేయడమేంటని మండిపడుతున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కీర్తి తాను చెల్లి పాత్రలు చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గోన్న కీర్తికి చెల్లి పాత్రలు చేయడానికి గల కారణమేంటని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి రోల్స్ వదులుకోవడం ఇష్టంలేదు. అందుకే చెల్లి పాత్రలు చేస్తున్నాను.. మరోకటి.. రజినీకాంత్ సర్ తో నటించాలని ఉంటుంది.. ఆ అవకాశం దొరకడం చాలా కష్టం.. అందుకే పెద్దన్నలో చెల్లి పాత్ర చేశాను..అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడం కష్టం.. పాత్ర ప్రాధాన్యతను బట్టి భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.. ఇటీవల చిన్నీ సినిమాతో మరోసారి తన ప్రతిభను చూపించింది కీర్తి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.