Most Recent

Anil Ravipudi: బాలయ్య సినిమా పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. అవన్నీ అదిరిపోతాయ్ అంటూ..

Anil Ravipudi

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)… ఇప్పటివరకు ఆయన తెరెకెక్కించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనిల్ రావిపూడి దిట్ట. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.. ప్రస్తుతం ఎఫ్ సిక్వెల్‏గా రాబోతున్న ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్‏లలో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి.. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్యతో తాను చేయబోయే సినిమాపై హింట్ ఇచ్చేశాడు..

ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడీ వరుస ఇంటర్వ్యూలు.. ఈవెంట్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నాడు.. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‏ను ఇంటర్వ్యూ చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.. తాజాగా ఆలీతో సరదాగా షోకు ముఖ్య అతిథిగా వచ్చాడు. నటుడు సునీల్‏తో కలిసి ఈ షోలో పాల్గోన్న అనిల్.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.. ఈ క్రమంలోనే ఆలీ మాట్లాడుతూ.. నువ్వు కేవలం కామెడీ చిత్రాలు మాత్రమే తీయగలవా ? లేదంటే మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాలు కూడా తీయగలవా ? అంటూ అడిగాడు.. దీంతో బాలకృష్ణ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ ఆయన సినిమాలో అవన్నీ అదిరిపోతాయ్ అంటూ చెప్పేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. దీంతో బాలయ్యతో తాను సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.