Most Recent

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Allari Naresh

ఎప్పుడూ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్ (Allari Naresh).. ఇప్పుడు రూటు మార్చారు.. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ ఇకపై విలక్షణమైన పాత్రలను చేయాలనుకుంటున్నారు. అలా.. నాంది సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. కామెడీ స్టార్‏గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఇది అల్లరి నరేష్ కెరీర్‏లో 59వగా వస్తున్న సినిమా ఇది. లో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పోస్టర్ గ‌మ‌నిస్తే.. నరేష్ మంచం ఓ చివరన పట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎవరినో నరేష్ మోస్తున్నట్లు అనిపిస్తుంది. తలకు, చేతికి గాయాలు కనపడుతున్నాయి. నరేష్ ఓ ఇన్‌టెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా పృథ్వి వ‌ర్క్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: నెట్ శారీ లో కుర్రకారుని కవ్విస్తున్న కళావతి… కీర్తి లేటెస్ట్ పిక్స్

Vijay Devarakonda: బర్త్‌డే రోజు ఎమోషనల్‌ అయిన విజయ్‌ దేవరకొండ.. సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.