Most Recent

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

Sonu Sood

మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood ).. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి తనవంతు సాయం అందచేశారు. మహారాష్ట్రకు నాగ్‏పూర్‏కు చెందిన 16 నెలల చిన్నారి విహాన్ స్పైనల్ మస్కులర్ ఆత్రోపి అనే అరుదైన వ్యాధితో బాధపుడుతున్నాడు. ఆ చిన్నారి ప్రాణాలు దక్కాలంటే రెండు నెలల్లో రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.. అయితే అంత ఖరీదైన ఇంజెక్షన్ ఇప్పించే స్థోమత ఆ బాబు తల్లిదండ్రులకు లేదు.. డాక్టర్ విక్రాంత్, మీనాక్షి అకుల్వార్ తమ బిడ్డను బతికించుకోవాలని తాపత్రయపడుతున్నారు. దీంతో రూ. 16 కోట్లను సేకరించేందుకు విరాళాలు చేపట్టారు. సోషల్ మీడియా.. సన్నిహితుల ద్వారా తమ బిడ్డను బతికించుకోవడానికి విరాళాలు చెప్పట్టారు.

అయితే ఇప్పటివరకు ఈ చిన్నారికి సాయం చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్పాయ్ వంటి ప్రముఖులు స్పందించి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే సోనూసూద్ కూడా తనవంతు సాయం చేశాడు.. ఇప్పటివరకు వచ్చిన రూ. 4 కోట్ల విరాళాల్లో ఆయనదే ఎక్కువ భాగం ఉంది. అంతేకాకుండా.. ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించాడు.. అలాగే.. మీడియా సమావేశం నిర్వహించిన సోనూసూద్.. విహన్ ను బతికించుకోవడానికి ముందుకురావాలని అందరినీ కోరారు. ఆపన్నహస్తం అందించడంలో నాగ్ పూర్ ఆదర్శంగా నిలవాలి.. ఇప్పటివరకు విరాళాల ద్వారా రూ. 4 కోట్లు సేకరించాం. క్రౌడ్ ఫండింగ్ వేదికలు.. గోఫండ్ మీలో విరాళాలు అందజేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో సాయం చేయండి అంటూ కోరారు..ఇక విహాన్ బతకాలంటే నెల రోజుల్లో రూ. 12 కోట్లు సమకూర్చాలి. దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాలి కోరుకున్నారు. స్పైనల్ మస్కులర్ ఆత్రోపి.. వెన్నెముఖ కండరాల క్షీణత ఈ వ్యాధి లక్షణం. ఈ వ్యాధికి జాల్ గెన్జ్ మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. అమెరికాలో ఉండే ఈ ఇంజక్షన్ ఇవ్వాలంటే రూ. 16 కోట్లు ఖర్చు చేయాలి. గతంలో ఓ చిన్నారికి కూడా ఇదే వ్యాధితో బాధపడుతుంటే విరాళాలు సేకరించిన ఆ పాప బతకలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.