Most Recent

Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్.. పవర్ ఫుల్‏గా ఉందంటూ మెగాస్టార్ కితాబు..

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య (Acharya) సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ .. మెగాస్టార్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలో నటిస్తుండడంతో ఆచార్య సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఓవైపు ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‎కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుండడంతో మెగాస్టార్ చిరంజీవితోపాటు.. చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే విలేకరులతో సమావేశమై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఆచార్య సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, రామ్ చరణ్‏తో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా డైలాగ్ లీడ్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

డైరెక్ట్ర హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఆచార్య సినిమా టీంతో చిట్ చాట్ నిర్వహించిన హరీష్ శంకర్ ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీక్ చేసేలా చేశారు చిరంజీవి. “మొన్న వీడు మన ఇంటికి వచ్చి అరిస్తే.. ఏంటీ వీడి ధైర్యం అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వీడి వెనుక లక్షమంది నడుస్తారు. ఇదే వీడి ధైర్యం అనుకుంటా ” అని విలన్ చెప్పగా.. అతని పక్కనే ఉండే మరో వ్యక్తి.. ” కాదు.. ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అనే ధైర్యం ” అని చెప్పాడు. దీనిని చిరు తనదైన శైలీలో తిరిగి చెప్పాడు. చాలా బాగా రాశావ్ అంటూ చిరు కితాబు ఇచ్చారు. ఇక పవర్ స్టార్ డైలాగ్ అదిరిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.