Most Recent

Nani: కన్నడ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన నేచురల్‌ స్టార్‌ నాని.. అసలు విషయమేమిటంటే..

Ante Sundaraniki

శ్యామ్‌ సింగరాయ్‌ లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌ నజ్రియా నజీమ్‌ (Nazriya Nazim) హీరోయిన్‌గా నటిస్తోంది. మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి డీసెంట్‌ హిట్‌లతో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో (ఆడడే సుందరా), మలయాళంలో (ఆహా సుందరా) పేర్లతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే కన్నడ వెర్షన్‌లో మాత్రం డబ్‌ కావడం లేదు. దీనిపై టీచల్‌ లాంచ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ ‘మా సినిమాను కన్నడ ప్రేక్షకులు కూడా తెలుగులోనే చూస్తారు. చాలా మంది కన్నడిగులు తెలుగును అర్థం చేసుకుంటారు. వారు తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకే ఇష్టపడతారు. అందుకే కన్నడ వెర్షన్‌ లో మా సినిమాను డబ్ చేయడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.

సోషల్‌ మీడియాలో మార్చేశారు..

కాగా నాని చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు కన్నడ అభిమానులు తప్పుపట్టారు. దీంతో ఓ నెటిజన్‌ ‘నాని గారు మీరు తప్పుగా మాట్లాడారు. చాలామంది కన్నడిగులకు తెలుగు, తమిళ, మలయాళ భాషలు అర్థం కావు. అర్థం చేసుకోలేరు. అయితే అలాంటివారు కూడా మీ సినిమాలు చూడాలనుకుంటే అంటే సుందరానికి సినిమాను కన్నడలో కూడా డబ్‌ చేయాల్సిందే’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన నాని.. ‘కన్నడ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేని సమయంలో కూడా నా సినిమాలతో పాటు ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో అర్థాన్ని మార్చేశారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘తన అభిప్రాయాన్ని సరిగా చెప్ప్పలేకపోయుంటే క్షమించండి.. సరిహద్దులు దాటి కన్నడ సినిమాలు సాధించిన విజయాలకు నేనెంతో గర్వపడుతున్నా’ అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చాడు నాని.

Also Read:  PM Modi Address Live Updates: గురుతేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం..

Summer Skin Care: ఎండలో బయటకు వెళ్తున్నారా ? చర్మాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఈ రూట్లలో ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణ.. వివరాలివే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.