Most Recent

Nandamuri Balakrishna: ఆస్పత్రిలో మోకాలికి కట్టుతో బాలయ్య.. వైద్యులు ఏమన్నారంటే..

Balakrishna

గతేడాది అఖండ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). అదేవిధంగా ఆహాలో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే అంటూ సందడి చేశారు. ప్రస్తుతం ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. కాగా ఆస్పత్రిలో వైద్యులతో బాలయ్య దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆస్పత్రి వైద్యులు క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు తాజాగా మరోసారి శస్త్రచికిత్స (Knee Surgery) జరిగిందట. ఇది మైనర్‌ సర్జరీనేనని, ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం బాగుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరలం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోద్దని సూచించారు. దీంతో నందమూరి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

కాగా అఖండ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయమైంది. దీంతో హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు ఆయనకు శస్ర్త చికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ సమయంలోనూ బాలయ్య చేతికి కట్టుతో కనిపించారు. కాగా మరోసారి బాలయ్యకు శస్త్రచికిత్స జరగడంతో గోపీచంద్‌ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్లలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కన్నడ స్టార్‌ ధునియా విజయ్‌ కుమార్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఎస్‌ థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాలతో ఫ్యాన్స్ ని అట్రాక్ట్‌ చేస్తున్న వర్ష బొల్లమ్మ

Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..

Hyderabad: పాతబస్తీలో భగ్గుమంటున్న కుటుంబ కలహాలు.. చిన్న సమస్యలకే పెద్ద గొడవలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.