Most Recent

Mohan Lal: మలయాళ సూపర్‌ స్టార్‌ ఉదారత.. 20 మంది గిరిజన విద్యార్థులకు 15 ఏళ్ల పాటు..

Mohanlal

మోహన్‌లాల్‌.. మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోన్న ఈ నటుడు మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డబ్బింగ్‌ సినిమాలతో పాటు జనతా గ్యారేజ్‌, మనమంతా లాంటి డైరెక్ట్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారాయన. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కంప్లీట్‌ యాక్టర్‌ గా పేరున్న మోహన్‌లాల్‌ (Mohan Lal) సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. గిరిజన తెగకు చెందిన 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించేందుకు ఈ కంప్లీట్‌ యాక్టర్‌ముందుకొచ్చారు. ఇందుకయ్యే ఖర్చునంతా ‘విశ్వశాంతి ఫౌండేషన్‌’ ద్వారా చెల్లించనున్నారు.

కాగా గిరిజన విద్యార్థుల్లో విద్యా కుసుమాలు వెలిగించేందుకు విశ్వశాంతి ఫౌండేషన్‌ వింటేజ్‌ ప్రాజెక్టను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి దశలో 20 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు మోహన్‌లాల్‌. ‘విశ్వశాంతి ఫౌండేషన్‌ చొరవతో ‘వింటేజ్‌’ ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో నేను కూడా భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను ఎంపిక చేశాం. వారికి బంగార భవిష్యత్‌ను అందించేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్యను అందించనున్నాం. ఇందుకయ్యే ఖర్చును మేమే భరించాలనుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్‌ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. విద్యార్థులకు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు మోహన్‌ లాల్‌. ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఆయన చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: India Post Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

DC vs RCB Live Score, IPL 2022: మరో విజయం కోసం ఢిల్లీ, బెంగళూరు ఆరాటం.. టాస్ గెలిచిన రిషభ్ ..

Tollywood Actresses: సీనియర్ మోస్ట్ హీరోలకు ఫస్ట్‌ ఛాయిస్‌గా మారుతున్న అందాల భామలు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.