Most Recent

Mahesh Babu: షూటింగ్‌ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. ఇక బాక్సాఫీస్‌ రికార్డుల వేటకు సిద్ధమంటూ..

Mahesh Babu

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). గీత గోవిందం ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‏గా నటిస్తోంది. మే12న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అలరిస్తుండగా నేడు (ఏప్రిల్‌23) ఉదయం 11.07 గంటలకు టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేయనుంది. అయితే అంతకంటే ముందే మహేశ్‌ అభిమానులకు తీపికబురు అందించారు మూవీ మేకర్స్‌. సర్కారు వారి పాటకు గుమ్మడికాయ కొట్టేశామంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ పూర్తి. మే 12న బాక్సాఫీసును షేక్‌ చేసేందుకు సిద్ధమవుతుంది’ అంటూ సినిమాలోని మహేశ్‌ సరికొత్త లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో తాళాల గుత్తితో మహేశ్‌ మాస్‌ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ న్యూలుక్‌ ట్రెండింగ్‌లో ఉంది. మహేశ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో దీనిని వైరల్‌ చేస్తున్నారు.

కాగా హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తైంది. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్‌ యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్నాయి. కాగా మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‏గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌, ఇతర అప్డేట్స్‌ను ప్రకటిస్తామంటూ చిత్రబృందం తెలిపింది.

Also Read:KTR: తెలంగాణలో అప్పుల కంటే మిగులు ఆదాయమే ఎక్కువ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిమాణం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!

అందాలతో రచ్చ చేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోస్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.