Most Recent

KGF Chapter2: సలాం రాకీ భాయ్‌ అంటోన్న యశ్‌ గారాల పట్టి.. నెట్టింట్లో వైరలవుతోన్న క్యూట్‌ వీడియో..

Yash Family

Yash Daughter Ayra: కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ (Yash) నటించిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌2 కలెక్షన్ల ఊచకోత ఆగడం లేదు. ఏప్రిల్‌ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ సత్తాచాటుతున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి సౌతిండియన్‌ సినిమాగా కేజీఎఫ్‌2 (KGF2) అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసే పనిలో ఉన్నాడు హీరో యశ్‌. అందుకే చిత్రబృందంతో కలిసి వెకేషన్‌లో సరదాగా గడుపుతున్నారు. సినిమా షూటింగ్‌లతో ఫుల్‌ బిజీగా గడిపిన అతను ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. కాగా సోషల్‌ మీడియాలోనూ యశ్‌ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు. తన సతీమణి, పిల్లల ఫొటోలు, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇందులో యశ్‌ కూతురు ఐరా.. ‘సలాం రాకీ భాయ్‌.. రారా రాఖీ..’ అంటూ ఎంతో క్యూట్‌గా పాడింది. ‘నా రోజును ఐరాతో ప్రారంభించాను’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో ఈ వీడియో షేర్‌ చేయగా కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. యశ్‌ అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోను చూసి ముగ్ధులవుతున్నారు. ‘సో క్యూట్‌’, ‘బ్యూటిఫుల్‌ వీడియో’ అంటూ లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా యశ్‌ 2016లో తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్‌ రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తింపుగా 2018లో ఐరా జన్మించింది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో అధర్వ్‌ పుట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఆ సేవలపై 20 శాతం రాయితీ..

IPL 2022: 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు.. ఒక్కసారిగా విలన్‌గా మారిన 8 కోట్ల ప్లేయర్‌ ఎవరో తెలుసా?

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్‌.. ఎందుకో తెలుసా?

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.