Most Recent

Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్.. ఇప్పుడు హరిహరవీరమల్లు, భవధీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‏లో యాక్షన్స్ సీన్స్, టాకీపార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 5 భాషలలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. ఇందులో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. అంతేకాకుండా.. బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలకపాత్రలో నటించనుందట. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే కాకుండా.. కొన్ని సన్నివేశాల్లోనూ నోరా ఫతేహి కనిపించనుందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండడంతో అంచనాల భారీగానే ఉన్నాయి. ఫిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్ మొదటి నుంచి వినిపిస్తుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Nora Fatehi

Nora Fatehi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై

మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా

Prabhas: రాఖీభాయ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన యంగ్‌ రెబల్‌ స్టార్‌.. యష్‌ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా?

Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.