
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కలిసి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. చిరు చరణ్ ను కలిసి బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకున్న మెగా అభిమానుల కోరికను తీర్చారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఆచార్య సినిమా రిలీజ్ కావడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు చిరంజీవి, చరణ్ కటౌట్లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో సందడి చేస్తున్నారు. ఇందులో చరణ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని ముందునుంచి చెప్తున్నారు మేకర్స్. ఇందులో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటించాడు. ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ ఆచార్య సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో చరణ్ , చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు.
రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పైన అంచనాలను పెంచేసింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఆచార్య సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఓవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ల మాస్ ఇమేజ్‌ను క్యారీ చేస్తూనే మరోవైపు, తనదైన శైలిలో సందేశాత్మక కథతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. ఇక ఆచార్య థియేటర్స్ అభిమానుల కోలాహలం ,మాములుగా లేదు బెనిఫిట్ షో చూసేందుకు థియేట్సర్ దగ్గరకు భారీ గా చేరుకున్నారు అభిమానులు.
మరిన్ని ఇక్కడ చదవండి