
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. వెంకటేశ్, ప్రభాస్ వంటి హీరోలతో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆమె.. ఇప్పుడు బరువు తగ్గి నాజుగ్గా మారిపోయి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నమిత. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో వెంకటేశ్ సరసన జెమినీ చిత్రంలో నటించింది. అలాగే బాలయ్య సినిమాల్లో తనదైన నటనతో అలరించింది. ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బిల్లా చిత్రంలో గ్లామర్ లుక్స్ లో రచ్చ చేసింది. నటన, లుక్స్ పరంగా ఆకట్టుకున్న నమిత.. తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. అప్పట్లో బొద్దు బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ.. అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. అయితే తాజాగా నమితకు సంబంధించిన లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఆమె జిమ్ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. జిమ్ లో ఆమె కసరత్తులు చేస్తూ కనిపించింది. అప్పట్లో బొద్దుగా ఉన్న నమిత.. ఇప్పుడు బరువు తగ్గి పూర్తి స్లిమ్ గా మారిపోయింది. అసలు అనే స్థాయిలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం నమిత లేటేస్ట్ లుక్స్ వైరల్ కావడంతో వావ్ సూపర్ మేడమ్.. మేడమ్ ఇది మీరేనా.. రీఎంట్రీ ఎప్పుడూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నమిత కెరీర్ విషయానికి వస్తే..
ఆమె గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో జన్మించారు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. 1998లో ‘మిస్ సూరత్’ గా, 2001లో ‘మిస్ ఇండియా’ పోటీల్లో నాల్గవ రన్నరప్‌గా నిలిచారు. తెలుగులో సొంతం, జెమిని, భైరవి, బిల్లా చిత్రాలతో ఫేమస్ అయ్యారు. కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ సైతం చేశారు. 2017లో నటుడు వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు కవలలు జన్మించారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
నమిత లేటేస్ట్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..