Most Recent

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

1990 వ దశకంలో ఫ్యామిలీ, లవ్ స్టోరీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. అయితే దాదాపు పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఆయన సొంత బ్యానర్ ‘వడ్డే క్రియేషన్స్’పైనే ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. రాశీ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కథ కథనాల పరంగా పాజిటివ్ రివ్యూలు అందుకుంది. అయితే పోటీగా సమంత మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ కావడం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాకు మైనస్ గా మారింది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జులై 17 నుంచి వడ్డే నవీన్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

‘ఎదురు చూపులు ముగిశాయి.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వడ్డే నవీన్, రాశీ సింగ్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు జీ5 తెలుగులో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జులై 17న ప్రీమియర్.. కేవలం జీ5లో తెలుగులో’ అని జీ5 ట్వీట్ చేసింది. కమల్ తేజ నర్ల తెరకెక్కించిన ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాలో ల్ప తులస్కర్‌, దేవి ప్రసాద్‌, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. కార్తిక్ సుజాత సాయికుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

జీ 5 ఓటీటీలో  ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.