
ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు మస్త్ డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం మలయాళం నుంచి కనీసం ఒకటి రెండు సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. అలా ఈ వారం కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూవీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అది కూడా ఒకే టైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే రిలీజైన మలయాళ మిస్టరీ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డోస్ (Dose). అభిలాష్ ఆర్ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ సినిమా ఈ శుక్రవారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే.. ఇలా ఏకంగా ఐదు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో డోస్ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కంటెంట్ మీద ఉన్న విపరీతమైన కాన్ఫిడెన్స్ వల్లే నిర్మాతలు ఈ రేంజ్ మల్టీ-ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారని తెలుస్తోంది.
డోస్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మరణాల చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ (సిజు విల్సన్) పనిచేసే ఆస్పత్రిలో రోగులు వరుసగా చనిపోతుంటారు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఈ హత్యలు జరుగుతుంటాయి. చివరకు డాక్టర్ ప్రకాష్ భార్య కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. దీంతో ఆ సైకో కిల్లర్ ఎవరో తెలుసునేందుకు స్వయంగా ప్రకాశే రంగంలోకి దిగుతాడు. ఒక పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు? మరి ఆస్పత్రిలో వరుస హత్యలకు పాల్పడిన ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు అతనిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ.
ఐదు ఓటీటీల్లో డోస్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
#Dose (Malayalam) streaming from July 10 on PrimeVideo, SimplySouth, AhaTamil, ManoramaMax,LionsGatePlay
!!#OTT_Trackers pic.twitter.com/0fKM8KFcYY
— OTT Trackers (@OTT_Trackers) July 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
!!