Most Recent

ఆ హీరో మూవీ డిజాస్టర్ అయ్యింది.. కానీ హిట్ సినిమాకు వచ్చినన్ని డబ్బులు వచ్చాయి..

ఆ హీరో మూవీ డిజాస్టర్ అయ్యింది.. కానీ హిట్ సినిమాకు వచ్చినన్ని డబ్బులు వచ్చాయి..

దర్శకుడు వి.వి. వినాయక్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు వివి వినాయక్. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత విలువలు, చిత్రాల విజయం, పరాజయాలపై మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ ఆరంభం నుంచి తోడు నిలిచిన నిర్మాతలకు, పంపిణీదారులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని, వారికి నష్టం రాకుండా చూడటమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు వినాయక్. అలాగే ఆయన మాట్లాడుతూ.. వినాయక్ తన తొలి అడ్వాన్స్ బెల్లంకొండ సురేష్ గారి వద్ద తీసుకున్నట్లు, ఆ తర్వాత దిల్ సినిమాకు దిల్ రాజు గారితో, చిరంజీవి గారి ఠాగూర్ చిత్రంతో తన కల నెరవేరినట్లు తెలిపారు. కొడాలి నాని, మల్లెడి సత్యనారాయణ రెడ్డి, గాంధీ, కాశీ వంటి తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సినిమాలు చేసినట్లు వెల్లడించారు. శ్రీను వైట్ల వంటి సన్నిహితులతో కలసి వారితో సాగిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తోడు నిలిచిన వారందరికీ తన సినిమాల ద్వారా లబ్ధి చేకూర్చాలని తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని, హీరోల రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండా తనకు న్యాయం జరిగితేనే సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

తన కెరీర్‌లో విజయాలు మాత్రమే కాకుండా, యోగి, అఖిల్ వంటి చిత్రాలపై వచ్చిన ఫ్లాప్ ముద్ర గురించి కూడా వినాయక్ వివరించారు. ఆది సినిమా విజయవంతమైనా, ఆ తర్వాత తనకు ఎదురుదెబ్బ తగిలిందని, అయితే తన ఏ సినిమా కూడా పూర్తిగా నాశనమయ్యేంత డిజాస్టర్ కాలేదని ఆయన అన్నారు. యోగి సినిమా ఫ్లాప్ అయినా, ఎవ్వరికీ ఆఫీసులు మూసేసేంత నష్టం రాకుండా చూసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ, ఇది ఫ్లాప్ చిత్రంగా ముద్రపడినప్పటికీ, నైజాం ప్రాంతంలో ఆరు కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించిందని, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

“ఒక హీరోకి సూపర్ హిట్ వస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ సినిమాకి వచ్చింది” అని ఆయన అన్నారు. అయితే, సినిమాను అత్యంత భారీ ధరలకు అమ్మడం వల్లే పంపిణీదారులు నష్టపోయారని వినాయక్ అన్నారు. ఆ సమయంలో తాను స్వయంగా రంగంలోకి దిగి, తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని వదులుకొని, పంపిణీదారులకు 50 శాతం నష్టాన్ని పూడ్చినట్లు స్పష్టం చేశారు. “ఎంత డబ్బు ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు?” అని అడిగి, ఆ డబ్బును తాను చెల్లించానని, ఆ సినిమా నుండి తాను ఎలాంటి లాభమూ పొందలేదని అన్నారు వినాయక్. అదేవిధంగా తన దృష్టిలో ఫెయిల్యూర్ అంటే ఏమిటో వివరించారు. కేవలం ఆర్థికంగా నష్టం రావడమే కాకుండా, 100 మంది ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్తే, వారిలో కనీసం 60-65 మందికి సినిమా నచ్చితే అది విజయానికి దగ్గరగా ఉంటుందని, ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించిన సినిమానే నిజమైన పరాజయమని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు మొదట మిశ్రమ స్పందన పొందినా, ఆ తర్వాత వసూళ్లను రాబట్టాయని అన్నారు.

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.