
బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఆ అనుభవం నుంచి కోలుకోవడానికి సమయం పట్టిందని నటి తేజస్వి మదివాడ తెలిపింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. బిగ్ బాస్ తర్వాత సినీ పరిశ్రమ, మీడియా పనితీరుపై తీవ్ర విరక్తి చెంది, నటనా రంగం నుండి పూర్తిగా వైదొలగి, ప్రపంచ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ఆమెను సంప్రదించి కమిట్‌మెంట్ సినిమా అవకాశాన్ని ఇవ్వడంతో తిరిగి పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది తేజస్వి మదివాడ. తెలుగు అమ్మాయిలకు సినీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ.. “బాంబే నుండి వచ్చే యాక్ట్రెసెస్ గానీ, బయట నుంచి సౌత్ నుంచి, తమిళ్ నుంచి, మలయాళం నుంచి వచ్చే యాక్ట్రెసెస్ కి ఛాన్స్ లు వస్తాయి. మనకి ఎప్పుడూ పక్కింటి కూర ఇష్టం. ఇంట్లో ఉన్న ఫుడ్ ఎప్పుడూ నచ్చదు అన్నట్టు, తెలుగు అమ్మాయిలకి ఆల్వేస్ దే హావ్ లైక్ ఏ డిఫరెంట్ కోటా” అని తెలిపింది తేజస్వి మదివాడ. అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితి మారుతోందని, లక్ష్మీకాంత్ చెన్నా తన సినిమాలో ఎక్కువ మంది తెలుగు వారికే అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నించారని ఆమె ప్రశంసించారు. తెలుగు ప్రజల ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకుంటే బయటి నుంచి నటీనటులు అవసరం లేదని తేజస్వి చెప్పుకొచ్చింది.
తాను స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా, ఫిల్టర్ లేకుండా మాట్లాడటం వల్ల తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, దీనివల్ల తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని తేజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. నవదీప్‌ను “వాడు” అని తాను అనగానే, ఆ చిన్న బిట్‌ను మాత్రమే తీసుకుని యూట్యూబ్‌లో పెద్ద రచ్చ చేశారని తెలిపింది. తనకు పెద్ద BMW ఉందని, ఇల్లు ఉందని, పెళ్లి జరిగిందని వంటి అనేక తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని, ఈ “ట్రాష్” వల్లనే ఇండస్ట్రీని వదిలివేయాలని అనుకున్నానని తెలిపింది తేజస్వి మదివాడ.
గతంలో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు.. అక్కడ జరిగేది ఒకటి మనకు చూపించేది మరొకటి. బిగ్ బాస్ చూసిన జనాలు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మా గురించి పిచ్చుపిచ్చిగా మాట్లాడుకుంటుంటారు.. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. దాంతో దర్శకనిర్మాతలు మాకు ఛాన్స్ లు ఇవ్వడానికి వెనకడుతారు. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనడం వల్లే నా కెరీర్ నాశనం అయ్యింది అని తెలిపింది తేజస్వి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లే గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఫెమస్ అవ్వడమేమో కానీ ఉన్న ఫేమ్ పోతుంది అని తేజస్వి చెప్పుకొచ్చింది తేజస్వి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి