Most Recent

ఇన్నాళ్లు ఏమైపోయింది మావ..! జర్నీ సినిమాలోని ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ఇన్నాళ్లు ఏమైపోయింది మావ..! జర్నీ సినిమాలోని ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

చాలా సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసి వేస్తుంటాయి. కొన్ని సినిమాలు ఒకే ఒక్కసారి ఆకట్టుకుంటాయి.. తర్వాత బోర్ కొట్టేస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు అలా కాదు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టావు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా ఫేవరేట్ మూవీ ఇది. 2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్‌ కొండేటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళంలో ఎంగీయుం ఎప్పుతం గా తెరకెక్కింది. ఇదే సినిమాను తెలుగులో జర్నీగా డబ్ చేసి రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండు లవ్ స్టోరీస్ చూపించారు.

అలాగే ఊహించని సంఘటన ఈ సినిమాలో చూపించారు. ఓ రోడ్డు ప్రమాదం అందరి జీవితాలను ఎలా మార్చేసింది అనేది చూపించారు. రెండు బస్సులు ప్రమాదాన్ని చూపించారు. ఆ సన్నివేశం చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది. ఎన్ని సార్లు చూసిన జర్నీ సినిమా బోర్ కొట్టాదు. ఇక ఈ సినిమాలో చాలా స్టోరీస్ చూపించారు. అలాగే బస్సులో ఓ చిన్న ప్రేమ కథను కూడా చూపించాడు దర్శకుడు. బస్సులో ఓ కాలేజ్ స్టూడెంట్ ఓ అమ్మాయిని చూడటం.. చూసి ప్రేమలో పడటం.. ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడటం చూపించారు. కానీ ఆ చిన్న ప్రేమ కథ విషాదంతో ముగుస్తుంది.

బస్సు యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి చనిపోతుంది. సినిమాలో ఆమె చనిపోయినప్పుడు ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. అయితే ఆ అమ్మయి గుర్తుందా.? ఆ చిన్నది తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దీప్తి నంబియార్. ఈ చిన్నది పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ చిన్నది జర్నీ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా ప్రేక్షకులను చూపుతిప్పుకొకుండా చేసింది. కానీ ఆతర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నది సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. కానీ ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.