Most Recent

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌! టీఆర్పీ రికార్డులు బద్దలవ్వాల్సిందే

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌! టీఆర్పీ రికార్డులు బద్దలవ్వాల్సిందే

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో ‘బిగ్ బాస్’ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే పదో సీజన్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. సామాన్యుల కోసం వచ్చే నెల 25 నుంచి ‘అగ్నిపరీక్ష 2’ పోటీలు కూడా మొదలు కానున్నాయి. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ లో మరిన్ని హంగులు, ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికలోనూ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోనున్నారట. ఎప్పుడు లేని రేంజ్ లో ఈసారి బాగా పేరు మోసిన సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయనున్నారట. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఈసారి ప్రముఖల పేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తేజస్విని గౌడ, పల్లవి గౌడ, జబర్దస్త్ వర్ష, పవిత్ర, వర్షిణీ, ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, పల్లవి గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కల్యాణ్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ తదితరుల పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది.

ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చకుంది రేఖ వేదవ్యాస్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే ఏమైందో తెలియదు కానీ 2014 తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు రేఖ. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందీ అందాల తార. అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జబర్దస్త్ వర్షతో రేఖ..

 

View this post on Instagram

 

A post shared by @anandam_rekha

‘బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి. అన్ని కెమెరాల ముందు , అంతమంది తో పోటీపడి టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తాను. కానీ నాకు ఆ రియాలిటీ షో కి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్లమంటే వెళ్తాను కానీ , కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఇలా చెప్పిన వారే బిగ్ బాస్ షోలోకి సడెన్ గా ఎంట్రీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు రేఖ కూడా అదే చేయనుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @anandam_rekha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.