Most Recent

Shobha Shetty: సీరియల్స్‌ మానేసిన శోభా శెట్టి ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ఒక్కో నెలలో అన్ని లక్షలు సంపాదిస్తుందా?

Shobha Shetty: సీరియల్స్‌ మానేసిన శోభా శెట్టి ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ఒక్కో నెలలో అన్ని లక్షలు సంపాదిస్తుందా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ నటి శోభా శెట్టి ఒకరు. బిగ్ బాస్ ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన శోభా టైటిల్ గెలవనప్పటికీ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ఇక కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది శోభా శెట్టి. అయితే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక వెంటనే బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ కంటే ముందు శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది సీరియల్సే. ముఖ్యంగా కార్తీక దీపంలో మోనితగా ఆమె నటనను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేదు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సీరియల్ లోనూ కనిపించలేదు శోభ. చివరకు తనకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టిన కార్తీక దీపం సీక్వెల్ (కార్తీక దీపం 2 ఇది నవ వసంతం) లోనూ ఆమె కనిపించలేదు. ఇందులో శోభా పాత్రను గాయత్రి సింహాద్రి రీప్లేస్ చేసింది. అయితే సీరియల్స్ చేయనప్పటికీ అడపా దడపా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోందీ అందాల తార. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్ తో ఎక్కువగా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానెల్ ద్వారానే శోభా శెట్టికి భారీ ఆదాయం వస్తోందని తెలుస్తోంది.

శోభా శెట్టికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ కు దాదాపు 7.07 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇక శోభా శెట్టి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ముఖ్యంగా ఆమె వీడియోలకు యూట్యూబ్ లో మంచి స్పందన వస్తోంది. ఒక్కో వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. వీటి ద్వారా నెలకు దాదాపు 10 లక్షల వరకు ఆదాయం వస్తోందని తెలుస్తోంది.

శోభా శెట్టి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Shobha Shetty (@shobhashettyofficial)


కాగా శోభా శెట్టి తన తోటి నటుడు యశ్వంత్ (కార్తీక దీపం ఫేమ్) తో ప్రేమలో ఉంది. గతంలో వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. పెళ్లిపీటలెక్కనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు తమ పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదీ లవ్ బర్డ్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.