Most Recent

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్.. 16 ఏళ్ల తర్వాత స్నేహితుడి కోసం.. ఈయన ఎవరో తెలుసా..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్.. 16 ఏళ్ల తర్వాత స్నేహితుడి కోసం.. ఈయన ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చివరిసారిగా ఓజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు పవన్. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. త్వరలోనే ఈ మూవీ సైతం అడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 26న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఆనంద్ సాయి బాగుంటుందని పవన్ కళ్యాణ్ ను తానే అడిగానని అన్నారు. ఆయనను అడుగు చేస్తానంటే తనకేం ప్రాబ్లమ్ లేదని అన్నారని.. ఆనంద్ సాయిని అడగ్గానే.. పవన్ సినిమాకు వర్క్ చేసి చాలా కాలం అయ్యిందని.. వెంటనే చేస్తా అని అన్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక పాట కోసం ఆనంద్ సాయి సెట్ డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు. మైత్రి మూవీస్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ సెట్ అని.. ఆనంద్ సాయి అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ తెలుగు సినిమాలో ఉండడం గర్వకారణం అని అన్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరలవుతుండగా.. ఆనంద్ సాయి గురించి సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

ఆనంద్ సాయి విషయానికి వస్తే.. పాపులర్ ఆర్ట్ డైరెక్టర్. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ఆలయ నిర్మాణాల్లోనూ భాగం అయ్యారు. యాదాద్రి టెంపుల్ కూడా ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్. దగ్గరుండి ఆలయ నిర్మాణ పనులు చూసుకున్నారు. 2013లో నాయక్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం ఆలయాల నిర్మాణంలోనే స్థిపతిగా ఉంటున్నారు. పవన్, ఆనంద్ సాయి ఇద్దరూ 30 ఏళ్లుగా స్నేహితులు. గతంలో తొలి ప్రేమ, తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా వంటి చిత్రాలకు పనిచేశారు. చివరగా 2010లో కొమురం పులి సినిమాకు సైతం ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు వర్క్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

 

View this post on Instagram

 

A post shared by B.ANAND SAI (@artdirectoranandsai)

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.