
అనారోగ్యం ఇతర కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన సమంత మళ్లీ ప్రొఫెషనల్ గా బిజీ అవుతోంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. అలాగే నిర్మాతగానూ బిజీ అవుతోంది. తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను నిర్మిస్తోంది సామ్. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు దీంతో పాటు బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో సామ్ యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలు చేస్తూన మరోవైపు బిజినెస్ రంగంలోనూ తన ట్యాలెంట్ చూపిస్తోందీ స్టార్ హీరోయిన్. ఇప్పటికే సాకీ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ ను రన్ చేస్తోంది సామ్. అలాగే ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే దీని గురించి మాట్లాడుకుంటుండగానే మరో బిజినెస్ ప్రారంభించిందీ సామ్.
తాజాగా ట్రూలీ. స్మా (Truly. Sma) అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీనికి ‘న్యూ చాప్టర్ బిగిన్స్’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సామ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
సమంత షేర్ చేసిన వీడియో ఇదిగో..
View this post on Instagram
సమంత లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..