Most Recent

Rashmika Mandanna: ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్: రష్మిక మందన్నా

Rashmika Mandanna: ప్రతి ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్: రష్మిక మందన్నా

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 11) సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ. 1674002,1673932,1673906,1673161‘బయట ఉన్న భూమా, దుర్గ, అమ్మలు అందరికీ బిగ్ హగ్.. భూమా లైఫ్‌లో కొన్ని సంఘటనలు జరిగాయి. జరిగేటప్పుడు ఇది నా మిస్టేక్ అనిపించేది. ఈ స్క్రిప్ట్ చదివినపుడు అబ్బాయి అయ్యుండి అమ్మాయిల మనసు ఎలా తెలుసుకున్నారు అనిపించేది రాహుల్ గురించి. ఒక సైడ్‌లో ఆనందంగా ఉన్నా.. మరో సైడ్‌లో బాధ అనిపిస్తుంది.. ఇంత బాధ ఎలా బయటికి తీయొచ్చనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఆడియన్స్‌కు థ్యాంక్యూ. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌కు సరెండర్ అయిపోయి నటించాను. దీక్షిత్ లాంటి అబ్బాయి అమ్మాయిలందరికీ కావాలి.. రాహుల్ థ్యాంక్యూ.. విజయ్ మొదట్నుంచీ నా లైఫ్ లో పార్ట్ అయ్యావ్.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్ లాంటిది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఈ రోజే (నవంబర్ 12) మధ్యాహ్నం సినిమా చూసా.. చాలా చోట్ల కన్నీరు ఆపుకున్నా.. లోపల మనసు బరువెక్కిపోయింది.. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఇదొకటి. చాలా మంది స్టోరీస్ విన్న తర్వాత బాధ అనిపించింది. రిలేషన్ షిప్ అంటే ఫ్రెండ్ లాగా ఉండాలి.. లైఫ్ అంతా ఉండేలా ఉండాలి.. హై, లో లో మీతో కలిసి ఉండేలా ఉండాలి.
నీ పార్ట్‌నర్ నిన్ను పట్టించుకోవట్లేదంటే రెస్పెక్ట్ చేయట్లేదని.. అప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సినిమా ఈ నెంబర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు పని చేసిన వాళ్లంతా లైఫ్‌లో ఓ పర్పస్ ఫుల్ ఫిల్ చేసారు. రాహుల్ రవీంద్రన్‌ను రష్మిక ఎంత రెస్పెక్ట్ చేస్తుందో నాకు తెలుసు. ఆయన గురించి నాకు చెప్పిన వాళ్లంతా ఎంతో గొప్పగా మాట్లాడారు. అందరూ లవ్ చేస్తారు రాహుల్‌ను. దీక్షిత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావ్.. ఐ హేట్ యు అంటే నువ్వు గెలిచినట్లే. రష్మికను గీతా గోవిందం అప్పట్నుంచి చూస్తున్నా.. నిజంగా భూమా దేవియే.. సెట్ మీద అంతా హ్యాపీగా ఉండాలని చూస్తుంటుంది.. పక్క వాళ్ల హ్యాపీనెస్ కోసం చూస్తుంది. పీక్ కెరీర్‌లో ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఆమె ఏంటో చూపిస్తుంది. రష్మిక నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది నాకు.

‘నన్ను ఎవడైనా గెలికితే రివర్స్‌లో వెళ్తా.. రష్మిక మాత్రం కైండ్‌గా ఉంటుంది.. తన పని తను చేసుకుంటుంది.. ఒకరోజు ప్రపంచం ఏంటో నన్ను చూస్తుంది అని నమ్ముతుంది.. అదే జరిగిందని నమ్ముతున్నా. అందరం తప్పులు చేస్తాం. నేను కూడా తప్పులు చేస్తాం. పార్ట్‌నర్‌ను ప్రొటెక్ట్ చేసుకోవాలి.. అది కంట్రోలింగ్ అవ్వొద్దు.. వాళ్ల డ్రీమ్స్, హ్యాపీ నెస్ ప్రొటెక్ట్ చేయాలి.. ఇద్దరూ కలిసి ఎదగాలి అనేదాంట్లో పొసెసివ్ ఉండాలి. చావు పుట్టుక తప్ప మిగిలిన దాంట్లో అన్నింట్లోనూ మనకు ఛాయిస్ ఉంటుంది. చిన్న లైఫ్ మనది.. హ్యాపీగా ఉండాలి కానీ కాంప్లికేటెడ్‌గా ఉండొద్దు’ అని చెప్పుకొచ్చారు విజయ్.

ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో రష్మిక ఫుల్ స్పీచ్ వీడియో..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.