
వీడు మాములోడు కాదురా బుజ్జా!. .అని ఓ క్రైమ్ సినిమా తీసేంతగా ఉన్న కంటెంట్‌ను కదిలించారు హైదరాబాద్ పోలీసులు. పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరిన బొమ్మ చోర్ రవిని కటాకటాల బాటపట్టించారు. హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి రీసెంట్ బ్లాక్‌బస్టర్ ఓజీ మూవీ వరకు దాదాపు 21 వేల సినిమాల పైరసీ చేశాడన్నారు సీపీ సజ్జనార్. పైరసీ రాకెట్ కింగ్ పిన్ ఐ బొమ్మ రవి.. కరేబియన్ పైరేట్ అనే కొత్త బొమ్మను తెరపైకి తెచ్చారు పోలీసులు. ఎస్.. …పైరసీతో ఇండస్టీ ఆదాయానికి కోట్లలో గండికొట్టడమే కాదు.. ఫ్రీగా సినిమా చూపించే మిషతో ప్రజల డేటా కొట్టేశాడనే నిజాలు దర్యాప్తులో వెలుగు చూశాయి. బెట్టింగ్ యాప్ బండారాన్ని కూడా బయటకు లాగారు పోలీసులు.
ఐ బొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫారిన్ యాక్ట్‌ను కూడా జోడించారు పోలీసులు. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకుని కరేబియన్ దీవులకు చెక్కశాడు. 80లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్ షిప్ తీసుకున్నాడు. కరేబియన్ పాస్‌పోర్ట్‌తోనే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. విశాఖ, హైదరాబాద్‌లో తన ప్రాపర్టీస్‌ను సేల్ చేసి కరేబియన్ దీవులకు చెక్కేయాలనుకున్నాడు. కానీ ఖాకీల ఎంట్రీతో బొమ్మ చోర్ రవి కథ అడ్డం తిరిగింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మైండ్ సెట్ ఇలా ఎందుకు మారిందనే విషయంపై మేజర్ బ్రేక్ త్రూ దొరికింది. కాలేజ్ టైం నుంచి మ్యారేజ్ తర్వాత వరకు ఎదురైన అవమానాలే అతడ్ని ఎలాగైనా డబ్బు సంపాదించే దిశగా పురిగొల్పినట్లు తెలుస్తోంది.
2016లో ఒక యువతిని మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు రవి. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు.. రవి సంపాదన ఏ మాత్రం సరిపోలేదు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా పదే, పదే అనడంతో మానసికంగా ఇబ్బందులకు లోనైనట్లు సమాచారం. ఈ క్రమంలో బీఎస్సీ కంప్యూటర్స్ నాలెడ్జ్, మరికొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లకు రూపకల్పన చేశాడు. ఆపై బెట్టింగ్ యాప్స్ సహా వివిధ మార్గాల్లో సొమ్ము వచ్చిపడింది. తన ఇన్‌కం ఇంత అని భార్యకు చూపించినా.. ఆమె అతడితో దాంపత్య జీవితం కొనసాగించేందుకు ఇష్టపడలేదట. దీంతో కరీబియన్ దీవులకు చెందిన సెయింట్స్ కీట్స్ అండ్ నెవిస్ దేశం వెళ్లి ఆపరేషన్స్ స్పీడప్ చేశాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. ప్రొపర్టీ సేల్ చేసి.. మళ్లీ వెళ్లిపోదామనకుని అడ్డంగా బుక్కయ్యాడు.
మరోవైపు దేశవ్యాప్తంగా తమ సేవలు నిలిపివేస్తున్నట్టు ఐ బొమ్మ వెబ్ సైట్ ప్రకటించింది. అలాగని కథ ఇంతటితో ముగియలేదు. బొమ్మ చోర్ రవితో పాటు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాకాలపై స్క్రూ బిగిస్తున్నారు పోలీసులు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కొందరు పోలీసులపై మీమ్స్ చేసిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు.