
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది ఈ కేరళ కుట్టి. ఇటీవల గ్లామర్ ఫోటోషూట్లతో షాకిస్తుంది ఈ వయ్యారి. కొన్ని రోజుల క్రితం బీచ్ లో గ్లామర్ ఫోటోలతో అరాచకం సృష్టించింది. దీంతో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ కు స్పందిస్తూ.. గ్లామర్ కి అసభ్యతకు మధ్య వ్యత్యాసం ఉందుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మడోనా సెబాస్టియన్. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో మంచి క్రేజ్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
అయితే మొదటి నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది మడోన్నా. పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో మడోన్నాను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. గ్లామర్ షోతో రచ్చ చేయడం ఏంటీ.. ఈ బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ అంటూ కామెంట్స్ చేశారు. అయితే తన పై వస్తున్న ట్రోల్స్ పై మడోన్నా రియాక్ట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
గ్లామర్ షో తప్పెం కాదు.. కానీ గ్లామర్ కు , అసభ్యతకు మధ్య వ్యత్సాసం తెలిస్తే చాలు.. అది నాకు తెలుసు.. నేనెం చేస్తున్నానో నాకు తెలుసు.. అంటూ కౌంటరిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో అటు గ్లామర్ షోకు సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఈ వయ్యారి నటించనున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..