
అందం, అభినయంతో ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. కానీ ఆమె చేసిన 4 సెకన్ల యాడ్ వీడియో ఒక్కసారిగా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ ఒక్క ప్రకటనతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. దీంతో ఆ యాడ్ చేసిన నిర్మాతకు 5 వేలకు పైగా కాల్స్ వచ్చాయంటే.. అప్పట్లో ఆమె అందం ఎంతగా ఆకర్షించిందో చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని స్వయంగా సదరు నిర్మాత వెల్లడించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? తనే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల ప్రముఖ నిర్మాత ప్రహ్లాద్ కక్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో జరిగిన ప్రకటన గురించి పంచుకున్నారు. అప్పట్లో ఐశ్వర్య రాయ్ కేవలం 4 సెకన్ల యాడ్ చేశారని.. కానీ ఆ ప్రకటన దేశం మొత్తాన్ని ఆకర్షించిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
ఐశ్వర్య చేసిన ప్రకటన పెప్సీ యాడ్. ఇప్పటికీ ఈ యాడ్ జనాలకు గుర్తుండిపోతుంది. ఇందులో అమీర్ ఖాన్ తోపాటు కొత్తమ్మాయి ఐశ్వర్య కనిపించింది. ఆ సమయంలో ఆమె కాలేజీ స్టూడేయ్. ఈ యాడ్ తర్వాత ఆమె అందం, లుక్స్ అందరిని ఆకర్షించాయి. దీంతో ఆ నిర్మాతకు కంటిన్యూగా కాల్స్ వచ్చాయట. అప్పట్లో ఆడిషన్ సమయంలో ఐశ్వర్య కళ్లలోకి చూసినప్పుడు ప్రపంచం మొత్తం తన కళ్లలోనే ఉన్నట్లు కనిపించిందని.. ఆమె మానసిక స్థితిని బట్టి ఆమె కళ్ల రంగు మారుతుందని.. కొన్నిసార్లు బూడిద రంగులో, కొన్నిసార్లు ఆకుపచ్చగా, కొన్నిసార్లు నీలం రంగులో ఉంటాయని.. అవన్నీ చూసి తాను ఆశ్చర్యపోయానని .. ఆమె ఒక మాయగా కనిపించిందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఐశ్వర్య చేసిన ఆ యాడ్ కేవలం 4 సెకన్లు మాత్రమే. ఈ యాడ్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఐశ్వర్య చేసిన ఈ యాడ్ ద్వారా ఐశ్వర్య మిస్ వరల్డ్ కాకముందే వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రకటన తర్వాత ఆమె ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. 1994లో, ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఐశ్వర్య ఫస్ట్ యాడ్ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?