Most Recent

Diwali 2025: అల్లువారింట ఘనంగా దీపావళి సంబరాలు.. సందడి చేసిన కొత్త కోడలు..

Diwali 2025: అల్లువారింట ఘనంగా దీపావళి సంబరాలు.. సందడి చేసిన కొత్త కోడలు..

పండగ అంటేనే కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపే సందర్భం. అటువంటిది దీపావళి అంటే దీపాల వెలుగులను తమ కుటుంబంలోని సభ్యులతో పాటు, స్నేహితులకు హితులకు పంచడం. అటువంటి దీపావళి పండగను టాలీవుడ్ తారలు ఘనంగా జరుపుకున్నారు. దీపావళికి రెండు రోజులు ముందుగా వేడుకలను నిర్వహించి ఆహ్వానం పలికిన బండ్ల గణేష్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకల్లో సందడి చేసిన వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా అల్లువారింట దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నట్లు… ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. అల్లు అరవింద్ కుటుంబ స‌భ్యులందరూ ఓకే చోట కలిసి వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తుంది.

అల్లు అరవింద్ దంపతులు తమ కొడుకులు, కోడళ్ళు, మనవలు మనవరాళ్ళతో పాటు… అల్లు శిరిష్ కి కాబోయే భార్య.. అల్లువారింట అడుగు పెట్ట నున్న కొత్త కోడలు కూడా ఈ ఫోటోలో ఉంది. ఫర్పెక్ట్ ఫ్యామిలీ ఫ్యాన్స్ దిల్ ఖుషీ అయ్యేలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonliine_)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.