-
తెలుగు సినిమా ప్రపంచంలో తొలి చిత్రంతోనే కుర్రకారును ఆగం చేసింది. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఈ వయ్యారి.. నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు అందుకోవడం లేదు. ఫస్ట్ మూవీతోనే హిట్టుకొట్టిన ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు.
-
ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టులో క్రేజీ ఫోటోలతో మాయ చేస్తుంది. ఈ అమ్మడుకు ఇన్ స్టాలో 20 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నాయి. తాజాగా చీరకట్టులో అందాల మాయ చేస్తుంది ఈ వయ్యారి. సైడ్ యాంగిల్ ఫోటోస్ షేర్ చేస్తూ మరింత అందంగా కనిపిస్తుంది. ఇంతకీ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
-
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. అనంతపురంకు చెందిన ఈ అమ్మాయి.. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.
-
కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఈ అమ్మడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.
-
ఇప్పటివరకు తెలుగులోనే పలు చిత్రాల్లో నటించింది ప్రియాంక. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఒకటి రెండు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్.. గెస్ట్ రోల్స్ మాత్రమే ఆఫర్స్ వస్తున్నాయి.