
అజిత్ కుమార్ క్రేజ్ గురించి తెలిసిందే. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. మరోవైపు షూటింగ్ నుంచి బ్రేక్ దొరికితే తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మరోసారి కార్ రేసింగ్ పై దృష్టి సారించారు. అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ కాబోతుందని సమాచారం. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసులో నటుడు అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఇటలీలో జరిగిన GT 4 యూరోపియన్ రేస్ యొక్క రెండవ రేసులో అజిత్ పాల్గొన్నాడు. ఈ రేసులో ముందు ఉన్న కారు అకస్మాత్తుగా ట్రాక్ అడ్డంగా ఆగిపోయింది. దీంతో అజిత్ కారు ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో, అజిత్ కారు ఎడమ ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న అజిత్ కుమార్‌కు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఆ వీడియోలో ప్రమాదం జరిగిన తర్వాత అజిత్ తన కారు నుంచి నడుస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే.. ఇలా రేసింగ్ లో అజిత్ కారు ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆయన రేసింగ్ లో పాల్గొన్న సమయంలో ప్రమాదాలకు గురయ్యారు. గతంలో రెండుసార్లు ఇలా కార్ రేస్ లో పాల్గొన్నప్పుడు అజిత్ ప్రమాదానికి గురయ్యారు. ఇక ఇది మూడోసారి కావడం గమనార్హం.
అజిత్ కారు యాక్సిడెంట్ వీడియో..
Out of the race with damage, but still happy to help with the clean-up.
Full respect, Ajith Kumar
https://t.co/kWgHvjxvb7#gt4europe I #gt4 pic.twitter.com/yi7JnuWbI6
— GT4 European Series (@gt4series) July 20, 2025
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..