
సినిమాల కంటే తన మంచి పనులు, సామాజిక సేవా కార్యక్రమాలతోనే అభిమానుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు సోనూసూద్. రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే ఆయన నిజ జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా క్లిష్ట కాలంలో ఈ నటుడు సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఇప్పటికీ సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సోనూసూద్. ఒక మంచి పని చేసి మనుషులే కాదు మూగజీవాల పట్ల కూడా ప్రేమ, దయతో మెలగాలని తన అభిమానులందరికీ సందేశమిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలో సోనూసూద్ నివసించే సోసైటీలోకి ఓ పాము ప్రవేశించింది. దానిని చూసి అక్కడున్నవారందరూ భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడే ఉన్న సోనూసూద్ మాత్రం అలా చేయలేదు. ఆ పామను ఉత్త చేతులతో జాగ్రత్తగా పట్టుకుని సంచిలో వేసి బంధించారు. ఆ పాము ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని స్థానికులకు వివరించారు. అయితే, పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు నిపుణులైన వారిని పిలిపించి మాత్రమే పట్టుకోవాలన్నారు. ఆ తర్వాత దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేసి రావాలని తన వద్ద పనిచేసే యువకులకు సూచించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోనూసూద్ తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. దీనికి హర హర మహదేవ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫేస్ బుక్ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్‌లలో లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. సినీ అభిమానులు, నెటిజన్ల నుంచి ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోనూసూద్ ధైర్యాన్ని అదే సమయంలో మూగ జీవాలపై ఆయన చూపించే ప్రేమను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ‘మీరు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు సార్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వీడియో ఇదిగో..
हर हर महादेव
#harharmahadev
pic.twitter.com/u500AcrlxS
— sonu sood (@SonuSood) July 19, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నంది పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూ సూద్. ఇందులో తాను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నాడీ రియల్ హీరో.
Every smile in this crowd carries a story—of struggle, of survival, of hope. And at the heart of it stands @SonuSood , turning pleas into possibilities.
From education to emergencies, he doesn’t just lend a hand—he restores faith.#FlashbackFriday #SonuSood #CauseYouMatter pic.twitter.com/aKEq8R5BGQ
— Sood Charity Foundation (@SoodFoundation) June 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.