
భారతీయ సినీపరిశ్రమలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద.. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో రామాయణ ఒకటి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దాదాపు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇటీవలే జూలై 3న విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. రణభీర్ కపూర్ రాముడిగా పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీత పాత్రలో సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఏ సినిమా నమోదు చేయని విజయాన్ని రామాయణ సినిమా సృష్టించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న సెలబ్రెటీల పారితోషికాల గురించి ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుంది. రణబీర్, సాయి పల్లవి ఈ సినిమాకు ఎంతవరకు పారితోషికం తీసుకుంటున్నారో మీకు తెలుసా.. ? అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామా. నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి రూ.75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. అంటే రెండు భాగాలుగా మొత్తం రూ.150 కోట్లు సంపాదిస్తాడు. గతంలో రణబీర్ ఒక్కో మూవీకు రూ.50 కోట్లు తీసుకున్నారు.
అలాగే సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి.. ఒక్కో భాగానికి రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. రెండు భాగాలకు మొత్తం రూ.12 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఇక గతంలో ఒక్కో సినిమాకు సాయి పల్లవి రూ.3 కోట్లు తీసుకుందట. ఇక ఇప్పుడు ఈ సినిమాకు 200 శాతానికి పైగా పారితోషికం తీసుకుంటుంది. ఈ మూవీ మొదటి భాగానికి రూ.900 కోట్లు.. రెండవ భాగానికి రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. మొత్తం రూ.1600 కోట్లతో ఈ సినిమా రెండు భాగాలను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..