Most Recent

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పట్టించుకోవడంలేదు.. దెబ్బకు కనిపించకుండా పోయిన బ్యూటీ

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పట్టించుకోవడంలేదు.. దెబ్బకు కనిపించకుండా పోయిన బ్యూటీ

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పైన ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆమె ఎవ్వరో తెలిస్తే మీరు కంగుతినడం ఖాయం. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు హాట్‌నెస్‌ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో సందడి చేసింది. చూడటాన్ని చబ్బీగా ఉండే ఈ చిన్నది ఒకప్పుడు ఎంతో సన్నగా సన్నజాలిలా ఉంది. కానీ ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే బుట్టబొమ్మలా మారిపోయింది. వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ అలరించింది హనీ రోజ్. అయితే వీరసింహారెడ్డి ఆమె ఫస్ట్ తెలుగు సినిమా కాదు. ఈ వ‌ర్షం సాక్షిగా  అనే మూవీతో 2014 ఆమె తెలుగు ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. మూవీస్ కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ప్రస్తుతం ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. తెలుగులో వీరసింహారెడ్డి సినిమా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు కనిపించకుండా పోయింది.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.