Most Recent

మూడేళ్ళుగా నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన జెనీలియా

మూడేళ్ళుగా నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన జెనీలియా

జెనీలియా డిసౌజా..ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరేట్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్ లో ఉంటుంది. ఆలాగే సై, ఢీ, హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే

ఆ మధ్య మరాఠీలో ఓ సినిమా చేసింది జెనీలియా. ఇక ఇప్పుడు జూనియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ సినిమా నేడు (18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జెనీలియా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు 13ఏళ్ల తర్వాత నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను. నా భర్త దర్శకత్వంలో నేను మరాఠీలో వేద్ అనే సినిమా చేశాను. సమంత నటించిన మజిలీ సినిమాకు ఇది రీమేక్. నేను సమంత చేసిన పాత్ర మాత్రమే చేశాను. కానీ ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ రీ ఎంట్రీ ఈ సినిమానే అని చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

13ఏళ్లుగా నేను నా భర్త, పిల్లలతో ఎంతో సంతోషమైన జీవితాన్ని గడిపాను.. ఇప్పుడు వాళ్లను వల్లే చూసుకుంటున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నా భర్త రితేష్ దేశ్ ముఖ్ మూడేళ్ళ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. రీ ఎంట్రీ ఇవ్వు అంటూ రోజూ టార్చర్ చేస్తున్నాడు. అందుకే 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాను. నన్ను జెనీలియా’గా కాకుండా ‘హాసినిగా’ గుర్తుపెట్టుకున్నారు. తెలుగులో మళ్లీ తిరిగి నటించాలని ఉంది. అలాగే నాతో పాటు చేసిన హీరోలందరూ ఇప్పుడు మంచి రేంజ్ లో ఉన్నందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా.

ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.