Most Recent

Venky Atluri: నేను రాసుకున్న ప్రతీ కథ ఫస్ట్ ఆ హీరోకే చెప్పాను.. కారణం ఇదే.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

Venky Atluri: నేను రాసుకున్న ప్రతీ కథ ఫస్ట్ ఆ హీరోకే చెప్పాను.. కారణం ఇదే.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో నటుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటున్నారు. అలాగే విభిన్నమైన కంటెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్ హీరోస్ కాకుండా ఎక్కువగా తమిళ్, మలయాళం హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు వెంకీ అట్లూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ రూపొందిస్తున్న సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ.. తన సినిమా ప్లానింగ్స్, తెలుగు స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అక్కినేని వీరాభిమాని వెంకీ అట్లూరీ. ఇదివరకే అఖిల్ అక్కినేని హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా మిస్టర్ మజ్ను. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కానీ తాను నాగచైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మాట్లాడుతూ.. తాను రాసుకున్న ప్రతీ కథను ముందుగా అక్కినేని నాగచైతన్యకే చెబుతానని అన్నారు. ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే నేరేట్ చేసినట్లు తెలిపారు.

వెంకీ మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకూ రాసుకున్న ప్రతీ కథ చైతన్యకే చెప్పాను.. నేను తీసిన 5 సినిమాలు ప్రతీది మొదట ఆయనకే చెప్పాను. ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో.. ఏదొక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు. కలిసినప్పుడల్లా ఈ విషయంపై జోక్స్ వేసుకుంటాం. నెక్ట్స్ టైం కలిసి పని చేద్దామని మాట్లాడుకుంటాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చైతూ. డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Man’s World India (@mansworldindia)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.