
సినీరంగుల ప్రపంచాన్ని నటిగా ఏలాలి అనుకుంది. చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. కానీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. దీంతో అర్దాంతరంగా తన జీవితానికి ముగింపు పలికింది. ఇప్పటికీ ఆమె మరణం అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. 25 ఏళ్ల వయసులోనే 6 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. మరణానంతరం ఆమె సూసైడ్ నోట్ చూసి కుటుంబసభ్యులు, అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న జియా ఖాన్.
19 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే మరింత పాపులర్ అయ్యింది. కానీ 2013 జూన్ 5న కేవలం 25 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2007లో వచ్చిన నిశబ్ద్ అనే సినిమాతో 19 ఏళ్ల జియా ఖాన్ అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి సన్నిహిత సన్నివేశంలో కనిపించింది. ఆ పాత్రకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ‘నిశ్శబ్ద్’ సినిమాలో 65 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన కూతురి 19 ఏళ్ల స్నేహితురాలు జియాతో ప్రేమలో పడటం చూపించారు. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.
జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె ప్రియుడు నటుడు సూరజ్ పంచోలిని జూన్ 10న ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ చేశారు.కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆమె మరణం మిస్టరీగానే ఉండిపోయింది. దీంతో పదేళ్ల దర్యాప్తు తర్వాత ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో సూరజ్ పంచోలిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జియా ఆత్మహత్య సమయంలో తన గదిలో 6 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. తన ప్రియుడు సూరజ్ పంచోలి కారణంగా ఎదుర్కొన్న పరిస్థితులు, ఆమె దుఃఖాన్ని ఆ లేఖలో వివరించింది. దీంతో అతడిపై జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. తన కూతురిని ఆత్మహత్య చేసుకునేలా ఆమెను వేధించాడని తెలిపింది. ఇప్పటికీ జియా ఖాన్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీలో వీడని మిస్టరీ.

Jiah Khan Life
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..