Most Recent

Iron Leg Sastry : ఐరన్ లెగ్ శాస్త్రి.. క్రేజ్ వచ్చిన పేరే జీవితాన్ని దెబ్బకొట్టింది.. ఆఖరి రోజుల్లో తిండి లేక..

Iron Leg Sastry : ఐరన్ లెగ్ శాస్త్రి.. క్రేజ్ వచ్చిన పేరే జీవితాన్ని దెబ్బకొట్టింది.. ఆఖరి రోజుల్లో తిండి లేక..

ఐరన్ లెగ్ శాస్త్రి… తెలుగు సినీప్రియులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఈ తరానికి తెలియని నటుడు.. కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ కమెడియన్. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన అప్పుల అప్పారావు సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యాడు. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వెండితెరపై దాదాపు 150కి పైగా సినిమాల్లో తనదైన నటనతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో కడుపుబ్బా నవ్వించారు. వీరిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు ఇప్పటికీ సినీప్రియులపై నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. నటనపై ఆసక్తితో కాకుండా అనుహ్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఐరెన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథశాస్త్రి.

సినీరంగంలోకి అడుగుపెట్టకముందు పౌరోహిత్యం చేస్తుండేవారు. ఐరన్ లెగ్ గా ఈవీవీ ఇమేజ్ క్రియేట్ చేశాక.. చిత్రసీమలో చాలాకాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హాస్య నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐరెన్ లెగ్ శాస్త్రి… ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే చివరి రోజుల్లో మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేకపోవడంతో పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు తన స్క్రీన్ పై ఉన్న పేరు ఉపాధి కరువయ్యేలా చేసిందట. గతంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

సినిమాల్లో ఐరెన్ లెగ్ శాస్త్రిగా ఫేమస్ కావడంతో.. అదే పేరు నిజ జీవితంలో ఉపాధి కరువయ్యేలా చేసింది. దరిద్రానికి, దురదృష్టానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించారు. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యంతో చేసుకుని బతికేద్దామని అనుకుంటే.. ఐరెన్ లెగ్ పేరు వల్ల ఆయనను శుభకార్యాలకు పిలిచేవారు కాదట. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.