Most Recent

ప్రేమించింది పెళ్లాడింది.. మూడేళ్లకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో లవ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..

ప్రేమించింది పెళ్లాడింది.. మూడేళ్లకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో లవ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..

నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఆరు సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరికాపురం కొన్నాళ్లే నిలబడింది. మూడేళ్లకే మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఆతర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని పిల్లాడిని కూడా కనేసింది.

ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన అమల పాల్. ఈ ముద్దుగుమ్మ ముందుగా మైన అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత సిద్దార్థ్ తో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్.

దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఆతర్వాత తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. నానితో చేసిన జెండాపై కపిరాజు సినిమా వచ్చివెళ్లిన విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాగే పిట్ట కథలు అనే సినిమా చేసింది. ఆతర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల పైనే ద్రుష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఆతర్వాత 2017లో2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్‌ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఇటీవలే ఓ బిడ్డకూడా జన్మించింది.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.