
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ట.
ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా విశ్వంభర సినిమాకు ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు విశ్వంభర సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం కీరవాణి కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా పని చేస్తున్నాడని అంటున్నారు. అతను ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో.. విశ్వంభర సినిమాలో ఓ సాంగ్ ను భీమ్స్ కంపోజ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ గా ఉండనుందని తెలుస్తుంది.. భీమ్స్ సిసిరోలియో ఇప్పటికే అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు భీమ్స్.. మెగాస్టార్ నెక్ట్స్ సినిమాకు కూడా భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అవ్వడంతో పాటు 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత అనిల్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.