Most Recent

Bigg Boss Telugu: ప్రియుడితో బిగ్‏బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరో తెలుసా..?

Bigg Boss Telugu: ప్రియుడితో బిగ్‏బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. సీజన్ 7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఇక అమర్ దీప్ తో జరిగిన గొడవతో ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు, ప్రైవేట్స్ సాంగ్స్ చేసింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శుభశ్రీ.. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ షేర్ చేసింది. తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో శుభశ్రీకి కాబోయే భర్త గురించి తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా.. ? అతడి పేరు అజయ్ మైసూర్.. అలియాస్ ఏజే మైసూర్.

ఏజే మైసూర్.. సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. శుభ శ్రీ రాయగురు, ఏజే మైసూర్ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. జూన్ 5న వీరిద్దరి నిశ్చితార్థ వేడక జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ రాయగురు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.

శుభశ్రీ విషయానికి వస్తే.. ఒడిశాకు చెందిన ఆమె.. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది. బిగ్ బాస్ షో ద్వారా గ్లామర్ బ్యూటీగా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేసినప్పటికీ అంతగా కలిసిరాలేదు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.